తెలంగాణలో ఎన్నికలు అయ్యాక తెలంగాణ రాష్ట్ర సమితి లో చీలికలు రావడం ఖాయమని అప్పుడు ప్రజా కూటమి తరుపున హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి . వరంగల్ జిల్లా కు చెందిన ఈ నాయకుడు మూడుసార్లు నర్సంపేట నుండి అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహించాడు . అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన రేవూరి ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు . ఈరోజు మీడియా ముందుకు వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డి హరీష్ రావు టీఆర్ఎస్ లో ఉంటూ ఎన్నో అవమానాలను దిగమింగుతున్నారని , అసలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఎప్పుడో కాంగ్రెస్ లో చేరేవాడని , ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదు ఎందుకంటే ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కు ప్రజా కూటమి కి సమానంగా సీట్లు వస్తే అప్పుడు టీఆర్ఎస్ ని చీల్చి ప్రజా కూటమికి మద్దతు ఇస్తాడని అంతేకాదు హరీష్ రావే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు . హరీష్ రావు నిజమైన నాయకుడని పొగడ్తల వర్షం కురిపించాడు రేవూరి .
కేసీఆర్ పై గజ్వెల్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా మరింత సంచలన వ్యాఖ్యలు చేసాడు హరీష్ రావు మీద . ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని ఓడించడానికి తెరవెనుక పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడని , నాకు కూడా ఫోన్ చేసి డబ్బు సహాయం చేస్తానని మాటిచ్చాడని రాహుల్ గాంధీ తో హరీష్ రావు టచ్ లో ఉన్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు . దాంతో హరీష్ రావు ఆ ఆరోపణలను ఖండించాడు . కానీ రాజకీయాలలో ఎవరినీ నమ్మలేం కదా ! అల్టిమేట్ గా పదవి కావాలి ఎవరికైనా .
English Title: TDP leader revuri prakash reddy sensational comments on harish rao