Homeటాప్ స్టోరీస్పేపర్ బాయ్ రివ్యూ

పేపర్ బాయ్ రివ్యూ

Paper Boy Reviewపేపర్ బాయ్ రివ్యూ :
నటీనటులు : సంతోష్ శోభన్ , రియా , తాన్యా
సంగీతం : భీమ్స్
నిర్మాతలు : సంపత్ నంది , రాములు , వెంకట్ , నరసింహా
దర్శకత్వం : జయశంకర్
రేటింగ్ : 2. 5/5
రిలీజ్ డేట్ : 31 ఆగస్టు 2018

యువ దర్శకులు సంపత్ నంది నిర్మాతగా మారి తన మిత్రులతో కలిసి మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి నిర్మించిన చిత్రం ” పేపర్ బాయ్ ” . దివంగత దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ పేపర్ బాయ్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవి (సంతోష్ శోభన్ ) బిటెక్ చదువుతూ పేపర్ బాయ్ గా పనిచేస్తుంటాడు . బుక్స్ ని అమితంగా ఇష్టపడే రవి ధరణి (రియా ) ని ప్రేమిస్తాడు , రవి పరిచయం కావడంతో అతడి ఆలోచనాసరళి , జీవనశైలి నచ్చి ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది . రవి పేదవాడు అయినప్పటికీ తన తల్లిదండ్రులని ఒప్పించి పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తుంది ధరణి . కానీ విచిత్రం ఏంటంటే ఆమె నుండి దూరంగా వెళ్లిపోవాల్సి వస్తుంది రవికి . ధరణి నుండి రవి విడిపోవడానికి కారణం ఏంటి ? వాళ్లిద్దరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ? చివరకు ఆ ఇద్దరూ ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

సంతోష్ శోభన్
పాటలు
ఛాయాగ్రహణం

డ్రా బ్యాక్స్ :

కథ
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్

నటీనటుల ప్రతిభ :

దర్శకులు శోభన్ తనయుడైన సంతోష్ శోభన్ కు హీరోగా ఇది రెండో సినిమా . తన రెండో సినిమాకే తనపాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు . పేపర్ బాయ్ గా సంతోష్ ని మించిన వాళ్ళని ఊహించుకోలేమంటే అక్కడే తెలిసిపోతుంది సంతోష్ నటన ఏ స్థాయిలో ఉందో . రియా కూడా నటనతో ఆకట్టుకుంది , ముఖ్యంగా సంతోష్ – రియా ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగా క్లిక్ అయ్యాయి . మరో పాత్రలో తాన్యా కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

సౌందర్య రాజన్ అందించిన ఛాయాగ్రహణం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . పేపర్ బాయ్ విజువల్ గా బాగా రావడానికి అతడి కృషి అభినందనీయం . భీమ్స్ అందించిన సంగీతం కూడా హైలెట్ గా నిలిచింది . అలాగే సురేష్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది . సంపత్ నంది , రాములు , నరసింహా , వెంకట్ లు ఖర్చుకి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు . ఇక దర్శకులు జయశంకర్ విషయానికి వస్తే ….. సంపత్ నంది రాసుకున్న కథ ని జయశంకర్ బాగానే తెరకెక్కించాడు కానీ స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది .

ఓవరాల్ గా :

యూత్ కి నచ్చే పేపర్ బాయ్

English Title: Paper Boy Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All