Homeటాప్ స్టోరీస్ఆ దర్శకుడిని దూరం పెడుతున్న స్టార్ హీరోలు

ఆ దర్శకుడిని దూరం పెడుతున్న స్టార్ హీరోలు

director sampath nandi career in dailomaయువ దర్శకులు సంపత్ నంది కెరీర్ డోలాయమానంలో పడింది . ఏమైందీ వేళ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది కి రెండో సినిమాకే రచ్చ చిత్రంతో చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సంపత్ నంది . రచ్చ కమర్షియల్ హిట్ అయ్యింది దాంతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది . అయితే ఆ సినిమా తెరకెక్కలేదు దాంతో కొంత సమయం వృథా అయ్యింది అయినప్పటికీ రవితేజ తో బెంగాల్ టైగర్ వంటి హిట్ ని రూపొందించి మంచి మార్కులే కొట్టేసాడు .

మధ్యలో తన మిత్రులతో కలిసి గాలిపటం అనే చిత్రాన్ని నిర్మించాడు కూడా . ఇక ఇప్పుడేమో పేపర్ బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . గోపిచంద్ తో తీసిన గౌతమ్ నంద భారీ డిజాస్టర్ కావడంతో సంపత్ నంది కెరీర్ డోలాయమానంలో పడిపోయింది . ఈ దర్శకుడికి ఛాన్స్ లు ఇచ్చే స్టార్ హీరోలు లేకుండాపోయారు . ఒక్కసారిగా గాలిపటం లా ఎగిసిన సంపత్ నంది కెరీర్ అదే స్పీడ్ లో పడిపోయింది .మళ్ళీ బ్రేక్ వచ్చే ఛాన్స్ ఉందా ? లేదంటే అంతేసంగతులా ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All