Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ - చరణ్ ల సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా

ఎన్టీఆర్ – చరణ్ ల సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా

ntr-charan-multi-starrer-movie-gets-release-dateయంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ లతో దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు రిలీజ్ చేయాలి అని ముందే డిసైడ్ అయ్యాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . ఇంతకీ ఎన్టీఆర్ – చరణ్ – రాజమౌళి ల భారీ మల్టీస్టారర్ విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా ……. 2020 వేసవిలో .

2018 అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది , అయితే తొలుత 2019 లోనే విడుదల చేయాలనీ అనుకున్నప్పటికీ ఎన్టీఆర్ – చరణ్ లు మాస్ హీరోలు దాంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి దానికి తోడు రాజమౌళి కూడా మరో స్టార్ అన్న విషయం తెలిసిందే దాంతో బ్రాండ్ ఇమేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అంచనాల సంగతి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అందుకే ఆ అంచనాలకు తగ్గట్లుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయనున్నారు కాబట్టి 2020 లో వేసవి కానుకగా విడుదల చేస్తేనే పెట్టిన పెట్టుబడికి , ఆ సినిమాపై ఉన్న అంచనాలకు సరైన సమయం అని భావిస్తున్నారట జక్కన్న . మొత్తానికి 2020 లో నందమూరి – మెగా అభిమానులకు పండగే పండగ అన్నమాట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All