Homeటాప్ స్టోరీస్నర్తనశాల ప్లాప్ : పేపర్ బాయ్ కి ప్లస్సా

నర్తనశాల ప్లాప్ : పేపర్ బాయ్ కి ప్లస్సా

positive reports to sampath nandi paperboyఈరోజు విడుదలైన నర్తనశాల ప్లాప్ కావడంతో రేపు విడుదలయ్యే పేపర్ బాయ్ చిత్రానికి మార్గం సుగమం అయ్యింది . దర్శకులు సంపత్ నంది ఈ పేపర్ బాయ్ చిత్రాన్ని తన మిత్రులతో కలిసి నిర్మించడం విశేషం . ఇక ఇటీవలే విడుదలైన పేపర్ బాయ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది అలాగే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని కొనుక్కునేలా చేసింది కూడా . అల్లు అర్జున్ కు ఈ చిత్ర ట్రైలర్ నచ్చడంతో తండ్రి అల్లు అరవింద్ కు చెప్పాడట ! ఇంకేముంది పేపర్ బాయ్ చిత్రాన్ని చూసాడు అల్లు అరవింద్ తనకు కూడా సినిమా నచ్చడంతో సినిమాని విడుదల చేస్తున్నాడు .

దివంగత దర్శకులు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు . ఇంతకుముందే సంతోష్ శోభన్ హీరోగా పరిచయమయ్యాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకు వస్తున్నాడు .ఈ సినిమా హిట్ అయితే అటు సంపత్ కు ఇటు సంతోష్ శోభన్ కు మంచి రోజులు వచ్చినట్లే ! పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి పేపర్ బాయ్ హిట్ కొట్టినా ఆశ్చర్యం లేదు .

- Advertisement -

English Title: positive reports to sampath nandi paperboy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All