Homeరివ్యూస్ఒక్క క్షణం రివ్యూ

ఒక్క క్షణం రివ్యూ

నటీనటులు : అల్లు శిరీష్ , సురభి , సీరత్ కపూర్ , అవసరాల శ్రీనివాస్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : చక్రి చిగురుపాటి
దర్శకత్వం : వి ఐ ఆనంద్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 28 డిసెంబర్ 2017
శ్రీ రస్తు శుభమస్తు వంటి హిట్ అందుకున్న అల్లు శిరీష్ తన తదుపరి చిత్రాన్ని ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ తో చేసాడు . రెండు జంటల మధ్య ప్యారలల్ గా జరిగే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ చిత్రంతో అల్లు శిరీష్ ప్రేక్షకులను మెప్పించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .
కథ :
మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం లేక ఖాళీగా ఉండే జీవా ( అల్లు శిరీష్ ) జ్యోత్స్న ( సురభి ) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు . జ్యో కూడా జీవా ని ఇష్టపడుతుంది ఇంకేముంది ఇద్దరూ లవ్ లో మునిగి తేలుతారు . జ్యోత్స్న ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే పక్క ఫ్లాట్ లో ఉండే శ్రీనివాస్ , స్వాతి ల మధ్య ఏదో జరుగుతోంది అన్న అనుమానంతో వాళ్ళని అబ్జర్వ్ చేసి షాక్ అవుతుంది , ఎందుకంటే సరిగ్గా వాళ్ళ జీవితంలో ఏ సంఘటనలు జరిగాయో అవే ఇప్పుడు తనకు జీవా కు మధ్య జరగడం . కట్ చేస్తే స్వాతి హత్యకు గురి అవుతుంది దాంతో ఆమెని హత్య చేసింది శ్రీనివాస్ అని అతడ్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు . శ్రీనివాస్ స్వాతి ని చంపాడు కాబట్టి తనని  కూడా జీవా చంపేస్తాడు అని భయపడుతుంది జ్యోత్స్న . అసలు స్వాతి ఎలా చనిపోయింది ? వాళ్ళ జీవితాల లాగే జీవా – జ్యో ల జీవితాల్లో సంఘటనలు ఎందుకు జరిగాయి . చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే  సినిమా చూడాల్సిందే .
హైలెట్స్:
సురభి గ్లామర్
అల్లు శిరీష్
అవసరాల శ్రీనివాస్ నటన
సెకండాఫ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
డ్రా బ్యాక్స్ :
ఫస్టాఫ్ లో కొన్ని బోర్ సీన్స్
స్లో నెరేషన్
నటీనటుల ప్రతిభ :
అల్లు శిరీష్ నటనతో ఆకట్టుకున్నాడు , తన ప్రేయసి ని కాపాడుకునే పాత్రలో బాగానే మెప్పించాడు . అయితే నటనలో ఇంకా రాటు దేలాల్సిన అవసరం ఉంది . రొమాంటిక్ సీన్స్ లో బాగా మెప్పించాడు . సురభి కి మంచి పాత్రే లభించింది , నటనకు ఆస్కారం ఉన్న పాత్ర తో పాటు అందాల ఆరబోత తో ఆకట్టుకుంది . అవసరాల శ్రీనివాస్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి , సీరత్ కపూర్ కూడా అందాల ప్రదర్శన చేసింది . ఇక దాసరి అరుణ్ కుమార్ ది చిన్న పాత్రే అయినప్పటికీ విలన్ గా మెప్పించాడు .
సాంకేతిక వర్గం :
ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తన మార్క్ ఏంటో చూపించిన దర్శకుడు వి ఐ ఆనంద్ . ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమా అనగానే అంచనాలు ఉండటం ఖాయం , ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు ఆనంద్ . ఫస్టాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్నాయి అలాగే సినిమా వేగం కూడా లోపించింది ఇంకాస్త వేగం పెంచి ఉంటే బాగుండేది . నిర్మాణ విలువలు బాగున్నాయి , మణిశర్మ సంగీతం యావరేజ్ గానే ఉంది ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది .
ఓవరాల్ గా :
విభిన్న తరహా చిత్రాలను కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్ ఈ” ఒక్క క్షణం ”
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All