Homeటాప్ స్టోరీస్మ‌హేష్ - త్రివిక్ర‌మ్ అప్పుడే రిలీజ్ టైమ్ ఫిక్స్‌!

మ‌హేష్ – త్రివిక్ర‌మ్ అప్పుడే రిలీజ్ టైమ్ ఫిక్స్‌!

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ అప్ప‌డే రిలీజ్ టైమ్ ఫిక్స్‌!
మ‌హేష్ – త్రివిక్ర‌మ్ అప్ప‌డే రిలీజ్ టైమ్ ఫిక్స్‌!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ , త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో సినిమా వ‌చ్చి 11 ఏళ్ల‌వుతోంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం `అత‌డు`. బాక్సాఫీస్ వ‌ద్ద కాస్ట్ ఫేల్యూర్‌గా నిలిచిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి ద‌రర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ త‌రువాత వీరిద్ద‌రూ క‌ల‌సి `ఖ‌లేజా` చేశారు. సినిమా హిట్టే కానీ ఇది కూడ కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఈ రెండు సినిమాల త‌రువాత వ్య‌క్తిగ‌త ఈగోల కార‌ణంగా వీరిద్ద‌రు మ‌ళ్లీ క‌లిసి సినిమా చేసి 11 ఏళ్ల‌వుతోంది. ఇన్నేళ్ల సుధీర్ఘ విరామం త‌రువాత మ‌రోసారి వీరిద్ద‌రి కాంబోతో ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌నని మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి కొంత ఆల‌స్యంగా శ‌నివారం సాయంత్రం ప్ర‌క‌టించారు. ఓ వీడియోని కూడా దీనికి జ‌త చేశారు. అంతేనా రిలీజ్ టైమ్‌ని కూడా ముందే లాక్ చేశారు.

- Advertisement -

`ఏ కాంబో కోస‌మైతే అంతా ఎదురుచూస్తున్నారో ఫైన‌ల్‌గా అది సెట్ట‌యింది. 11 ఏళ్ల సుధీర్ఘ విరామం త‌రువాత SSMB28 కోసం మ‌హేష్‌గారు, త్రివిక్ర‌మ్ గారు జ‌త‌క‌లిశారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ మూవీని నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్లో ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానుంది` అని మేక‌ర్స్ ట్వీట్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియోలో పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All