Homeటాప్ స్టోరీస్లీకైంది అరవింద సమేత దృశ్యాలే

లీకైంది అరవింద సమేత దృశ్యాలే

ntrs aravinda sametha scenes leak case filedగీత గోవిందం చిత్రంతో పాటు ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని సన్నివేశాలు లీక్ అయ్యాయి . దాంతో షాక్ తిన్న ఆ చిత్ర నిర్మాత రాధాకృష్ణ నిన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు . నిర్మాత ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు . ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం చిత్రంలోని సన్నివేశాలను లీక్ చేసిన విషయం తెలిసిందే . అయితే హార్డ్ డిస్క్ లో ఉన్న మరికొన్ని సినిమాలు కూడా లీక్ బాట పట్టాయని అప్పుడే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పాడు కూడా .

అయితే లీకైన భారీ చిత్రం ఏది అన్న చర్చ కూడా సాగింది , కట్ చేస్తే అరవింద సమేత చిత్రంలోని మూడు నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాకయ్యారు ఆ చిత్ర బృందం . ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు డేటా డిజిటల్ బ్యాంక్ లోని ఉద్యోగుల ను విచారిస్తున్నారు , అయితే అసలైన నిందితుడు చక్రవర్తి మాత్రం పరారీలో ఉన్నాడు అతడి కోసం గాలిస్తున్నారు . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఈలోపు ఈ షాక్ తగలడంతో యూనిట్ వర్గాలు షాక్ అయ్యాయి .

- Advertisement -

English Title: ntrs aravinda sametha scenes leak case filed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All