Homeటాప్ స్టోరీస్గీత గోవిందం టాక్ ఎలా ఉందంటే

గీత గోవిందం టాక్ ఎలా ఉందంటే

geetha govindam preview show talk విజయ్ దేవరకొండరష్మిక మండన జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” గీత గోవిందం ”. ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది . అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరగడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి . పైగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీమియర్ షోలు అప్పుడే ఓవర్ సీస్ లో పడ్డాయి . ఆ ప్రీమియర్ షోల ప్రకారం టాక్ ఉందంటే ……. ….. సినిమా హిట్ అనే అంటున్నారు .

లవ్ , రొమాన్స్ , ఎంటర్ టైన్ మెంట్ లతో సాగుతుందని అయితే ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ లో మాత్రం అనుకున్న విధంగా సన్నివేశాలు లేవని కేవలం విజయ్ దేవరకొండ, రష్మిక ,వెన్నెల కిషోర్ లతో సెకండాఫ్ సాగిందని అది కొంచెం బెటర్ గా ఉండుంటే సినిమా మరోలా ఉండేదని అంటున్నారు . మొత్తానికి విజయ్ దేవరకొండ – రష్మిక మండన ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని ప్రేక్షకులకు ఇది నచ్చుతుందని అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం కష్టమే అని అంటున్నారు . ఆ టాక్ ని పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఎలా ఉందో కొద్ది గంటల్లోనే తేలిపోనుంది .

- Advertisement -

English Title: geetha govindam preview show talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All