Homeటాప్ స్టోరీస్మహేష్ సినిమాలో ప్రభాస్ లేదా ఎన్టీఆర్ అట

మహేష్ సినిమాలో ప్రభాస్ లేదా ఎన్టీఆర్ అట

prabhas or ntr in mahesh babu 26th filmమహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తన 26 వ సినిమాని చేయడానికి డేట్లు ఇచ్చాడు మహేష్ . అయితే మహేష్ – సుకుమార్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు ” 1” నేనొక్కడినే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . అది డిజాస్టర్ కావడంతో మహేష్ తో పాటు అభిమానులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు .

ఆ సినిమా ఇచ్చిన షాక్ తో ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట సుకుమార్ . ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటుగా కీలక పాత్రలో మరో స్టార్ హీరో కావాలని అందుకు ప్రభాస్ లేదా ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని భావిస్తున్నాడట సుకుమార్ . ప్రభాస్ కు మొదటి ఛాయిస్ అప్పుడు ప్రభాస్ ఒప్పుకోకపోతే ఎన్టీఆర్ ని సంప్రదించాలని చూస్తున్నట్లు సమాచారం . మహేష్ బాబు తో ఎన్టీఆర్ లేదా ప్రభాస్ అంటే ఇక ఆ కాంబినేషన్ గురించి చెప్పతరమా ! థియేటర్ లో ఈలలే ఈలలు ….. గోలలే గోలలు .

- Advertisement -

English Title: prabhas or ntr in mahesh babu 26th film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All