Homeటాప్ స్టోరీస్తమన్ ని అంతగా పొగడాలా ..... ఎన్టీఆర్

తమన్ ని అంతగా పొగడాలా ….. ఎన్టీఆర్

Ntr praises taman సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెగ పొగిడాడు . ఆ పొగడ్త ఎంతగా ఉందంటే తమన్ సైతం తట్టుకోలేనంత గొప్పగా ఉంది. తమన్ అందించిన పాటల గురించి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి నేను వాటిని చూసాను అయితే అరవింద సమేత వీర రాఘవ చిత్రం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు మాత్రమే తెలుసు . ఈ సినిమాకు మనసు పెట్టి కాదు ప్రాణం పెట్టి సంగీతం అందించాడు తమన్ అంటూ అతడ్ని ఆకాశానికి ఎత్తేసాడు ఎన్టీఆర్. తను అందించిన సంగీతం గురించి ఎన్టీఆర్ అంతగా పొగుడుతుంటే తట్టుకోలేక ఎన్టీఆర్ కు అభివాదం చేసాడు తమన్ .దాదాపుగా కన్నీళ్ల పర్యంతమయ్యాడు తమన్.

- Advertisement -

అయితే ఎన్టీఆర్ పొగడ్తలు పక్కన పెడితే తమన్ అందించిన సంగీతం పై మాత్రం విమర్శలు చాలానే వస్తున్నాయి. తన ట్యూన్స్ ని తానే కాపీ కొట్టాడని , కొత్తగా లేవని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు . ఆ కామెంట్ లకు తగ్గట్లుగానే అరవింద సమేత ఆడియో పెద్దగా సక్సెస్ కాలేదు కాకపోతే రెండు పాటలకు మాత్రం స్పందన అద్భుతమనే చెప్పాలి. ఇక తెరమీద అవి ఎలాంటి కిక్ ఇవ్వబోతున్నాయి అన్నదానిపై మాత్రమే ఆధారపడి ఉంది. విమర్శలు , పొగడ్తలు పక్కన పెడితే ఎన్టీఆర్ మాత్రం తమన్ ని మరీ ఎక్కువ పొగిడాడు అంటే అతడి పై అంత నమ్మకం ఉంది మరి. ఎన్టీఆర్ – తమన్ ల కాంబినేషన్లో ఇంతకుముందు బృందావనం , రభస , బాద్ షా చిత్రాలు రాగా బృందావనం సూపర్ హిట్ అయ్యింది, బాద్ షా ఫరావలేదనిపించింది రభస మాత్రం ప్లాప్ అయ్యింది. మరి ఈ అరవింద సమేత బ్లాక్ బస్టర్ అవుతుందా ? ప్లాప్ జాబితాలో చేరుతుందా అక్టోబర్ 11న తేలిపోనుంది.

English Title: Ntr praises taman

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts