Homeటాప్ స్టోరీస్అరవింద సమేత సాంగ్స్ పై విమర్శలు

అరవింద సమేత సాంగ్స్ పై విమర్శలు

Netizens fires on ss thamanయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ , అయితే ఇతగాడు ఇచ్చిన ట్యూన్స్ కి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . తమన్ అంటేనే ఎక్కడెక్కడో కాపీ కొట్టిన ట్యూన్స్ తెలుగు తన సినిమాకు ఇస్తాడని విమర్శ ఉంది అయితే ఇప్పుడు దానికి భిన్నంగా తన ట్యూన్స్ ని తానె కాపీ కొట్టడం మరీ దారుణం . ఇంతకుముందు తాను సంగీతం అందించిన చిత్రాల్లోని పాటలకు ఇచ్చిన ట్యూన్స్ ని స్వల్ప మార్పులతో అరవింద సమేత చిత్రానికి ఇచ్చాడు దాంతో తమన్ ని విపరీతంగా తిడుతున్నారు నెటిజన్లు .

అంతేకాదు ఏ పాటని ఏ సినిమాలోంచి కాపీ కొట్టాడో దాని తాలూకు ట్యూన్స్ ఉదాహరణ కూడా ఇచ్చారు . అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అయితే ఆ జాగ్రత్తలు ఏమాత్రం తీసుకున్నట్లు లేదు అటు త్రివిక్రమ్ ఇటు తమన్ లు . అసలు ఈ సినిమాకు మొదట అనిరుద్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు కానీ అజ్ఞాతవాసి చిత్రం ప్లాప్ కావడంతో అతడి స్థానంలో తమన్ ని తీసుకున్నారు . తగినంత సమయం లేకపోవడం కావచ్చు లేదంటే ఎవరి ట్యూన్ ని కాపీ కొడుతున్నాడో కూడా తెలీని స్థితి కావచ్చు మొత్తానికి అరవింద సమేత ని కాపీ మయం చేసాడు తమన్ , అందుకు నెటిజన్ల నుండి తిట్లు కూడా తింటున్నాడు .

- Advertisement -

English Title: Netizens fires on ss thaman

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All