Homeటాప్ స్టోరీస్తెలంగాణలో ఎన్టీఆర్ దే రికార్డ్

తెలంగాణలో ఎన్టీఆర్ దే రికార్డ్

NTR new record in telangana with aravinda samethaయంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో అరుదైన రికార్డ్ కొట్టేసాడు . తెలంగాణ లో బాహుబలి చిత్రాలదే హవా , వాటి తర్వాత రంగస్థలం , ఖైదీ నెంబర్‌-150 , భరత్ అనే నేను తదితర చిత్రాలు భారీ వసూళ్ళ తో తదుపరి స్థానాల్లో ఉన్నాయి అయితే వాటిని వెనక్కి నెట్టి 20 కోట్ల షేర్ తో దూసుకుపోయాడు ఎన్టీఆర్ . నైజాం లో బాహుబలి , బాహుబలి 2 చిత్రాల తర్వాత స్థానం ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రందే . దసరా సెలవులు కావడంతో మొదటి రోజు నుండే ఎన్టీఆర్ భారీ వసూళ్లు సాధించాడు దాంతో ఈ రికార్డులు ఎన్టీఆర్ వశం అయ్యాయి . 20 కోట్ల షేర్ రావడంతో దిల్ రాజు చాలా సంతోషంగా ఉన్నాడు . తెలంగాణలో అరవింద సమేత చిత్రాన్ని విడుదల చేసింది దిల్ రాజు కావడం గమనార్హం .

ఇంతకుముందు దిల్ రాజు నిర్మించిన రెండు చిత్రాలు ఘోరంగా దెబ్బ కొట్టడంతో అరవింద సమేత లాభాలు దిల్ రాజు కు ఊరట నిచ్చేలా ఉన్నాయి . ఇప్పటికే 20 కోట్ల షేర్ రాబట్టిన ఎన్టీఆర్ మరో మూడు , నాలుగు కోట్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు . ఎందుకంటే ఎన్టీఆర్ కు పోటీగా సరైన చిత్రం లేకపోవడం కూడా ఎన్టీఆర్ కు బాగా కలిసొచ్చింది . మొత్తానికి ఎన్టీఆర్ తో తెలంగాణలో దిల్ రాజు లాభాల బాట పట్టాడు .

- Advertisement -

English Title: NTR new record in telangana with aravinda sametha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All