
యంగ్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఫస్ట్ వీక్ నుండి థర్డ్ వీక్ కు రేటింగ్స్ పెరుగుతూ ఈ షో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ షో మరింత ఆసక్తికరంగా మారడానికి సోమవారం నాడు ఈ షో కు స్పెషల్ గెస్ట్స్ రానున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేసిన విషయం తెల్సిందే.
ఇక సోమవారం ఎపిసోడ్ కు టాలీవుడ్ టాప్ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ స్పెషల్ గెస్ట్స్ గా విచ్చేసారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.
ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోగ్రాం ఇప్పుడు విడుదలైంది. ఈ ముగ్గురి మధ్య ర్యాపో అదిరింది. ముఖ్యంగా “ఇక్కడ బాస్ నేను” అని ఎన్టీఆర్ అనడం చాలా బాగుంది.