Homeటాప్ స్టోరీస్వచ్చే నెల మొదలుకానున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా

వచ్చే నెల మొదలుకానున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా

ntr30 to be launched next month 
ntr30 to be launched next month

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా రేంజ్ కు చేరుకుంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ కొంత ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తయింది. త్వరలోనే ఆ పార్ట్ ను పూర్తి చేయనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు ఎన్టీఆర్.

వీరిద్దరూ కలిసి గతంలో చేసిన జనతా గ్యారేజ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో వీరి రెండో ప్రయత్నంపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు కొరటాల శివ ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఒక సాంగ్, కొంత ప్యాచ్ వర్క్ మినహా ఆచార్య పూర్తయింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా వచ్చే నెలలో లాంచ్ అవ్వనుంది.

- Advertisement -

మిక్కిలినేని సుధాకర్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మోడ్ గా రూపొందించనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All