
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో వినోదానికి ఓటీటీలు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. దీంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లంతా వెబ్ సినీస్‌ల బాటపట్టారు. చాలా మంది ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. తమన్నా ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌లు చేస్తోంది. నిత్యామీనన్ కూడా ఈ జాబితాలో చేరింది. అభిషేక్ బచ్చన్‌తో కలిసి `బ్రీత్ : ఇన్ టు ద షాడోస్` సిరీస్‌లో నటించింది.
ఈ వెబ్ సిరీస్ ఇటీవలే హిందీలో విడుదలై నిత్యామీనన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఇదే సిరీస్‌ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇదిలా వుంటే తాజాగా నిత్యామీనన్ మరో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతోంది. ఇది తెలుగు వెబ్ సిరీస్ కావడంతో దీనిపై నిత్య ప్రత్యేక ఫోకస్ పెట్టిందట.
ఈ వెబ్ సిరీస్‌ని `మహానటి` ఫేమ్ స్వప్న దత్ నిర్మించనుందని తెలిసింది. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్‌కి ప్రముఖ నవలా రచయిత్రి బలభద్ర పాత్రుని రమణి కథ అందిస్తున్నారట. నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల సూపర్ విజన్‌లో ఈ వెబ్ సిరీస్‌ని డిసెంబర్ లేదా జనవరి నుంచి ప్రారంభించనున్నారని తెలిసింది.