
నిత్యామీనన్, రీతూ వర్మ కలిసి నటిస్తున్న చిత్రం `నిన్నిలా నిన్నిలా`. ఇందులో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి బ్యానర్‌పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర బృందం సోమవారం రిలీజ్ చేసింది. అర్బన్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. మీడియమ్ బడ్జెట్ చిత్రాల తరహాలో కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయిన, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని నిర్మాత వెల్లడించారు.
ఈ చిత్రానికి `ప్రేమమ్` ఫేమ్ రాజేష్ మురుగేషన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. దివాకర్ మణి ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు.