
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం `పెళ్లిచూపులు`. ఈ చిత్రంతో హీరోయిన్‌గా ఆకట్టుకుంది రీతువర్మ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా రీతు వర్మకు మాత్రం తెలుగులో ఆశించిన స్థాయి ఆఫర్లని అందించలేకపోయింది. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన రీతూ వర్మ టాలెంట్‌ని గుర్తించడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ మరోసారి విఫలమయ్యారని `కనులు కనులని దోచాయంటే` చిత్రం నిరూపించింది.
దుల్కర్ సల్మాన్, గౌతమ్ మీనన్ లతో కలిసి రీతూ వర్మ నటించిన ఈ చిత్రం మంచి పేరుతో పాటు ఆమె ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. ప్రస్తుతం విక్రమ్‌లో `దృవనక్షత్రం` చిత్రంలో నటిస్తున్న రీతూ వర్మ తాజాగా నటించిన తమిళ అంథాలజీ ` పుతం పుధు కాలై`. ఐదు భాగాలుగా దీన్ని ఐదుగురు కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్స్ రూపొందించారు.
గౌతమ్‌మీనన్, సుధా కొంగర, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజు, సుహాసిని మణిరత్నం ఈ అంథాలజీని డైరెక్ట్ చేశారు. ఈ నెల 16న అమెజాన్ ప్రైమ్‌లో ఈ అంథాలజీ స్ట్రీమింగ్ మొదలైంది. ఇందులో `అవనుమ్ నానుమ్ – అవలుమ్ నానుమ్`కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ పార్ట్‌లో కన్నా అనే పాత్రలో రీతు వర్మ నటించింది. ఈ పాత్రలో రీతు అద్భుతంగా నటించి ఆకట్టుకుంటోంది. నటిగా తన క్యాలిబర్ ఏంటో మరోసారి నిరూపించింది. `అవనుమ్ నానుమ్ – అవలుమ్ నానుమ్` చూసిన వాళ్లంతా రీతు వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా రీతు టాలెంట్‌ని టాలీవుడ్ గుర్తించాలని కామెంట్‌లు చేస్తున్నారు. రీతు వర్మ ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న `టక్ జగదీష్`తో పాటు నాగశౌర్య నటిస్తున్న సినిమాల్లో నటిస్తోంది.