Homeటాప్ స్టోరీస్ఆదిత్య మూవీస్ - నితిన్ హిందీ డ‌బ్బింగ్ చిత్రాల‌కు అనూహ్య స్పంద‌న‌

ఆదిత్య మూవీస్ – నితిన్ హిందీ డ‌బ్బింగ్ చిత్రాల‌కు అనూహ్య స్పంద‌న‌

ఆదిత్య మూవీస్ - నితిన్ హిందీ డ‌బ్బింగ్ చిత్రాల‌కు అనూహ్య స్పంద‌న‌
ఆదిత్య మూవీస్ – నితిన్ హిందీ డ‌బ్బింగ్ చిత్రాల‌కు అనూహ్య స్పంద‌న‌

ద‌క్షిణ భార‌తంలోనే అత్యంత నేరున్న మ్యూజిక్ కంప‌నీగా కొన‌సాగుతోంది ఆదిత్య మ్యూజిక్‌. ఈ సంస్థ‌కు సంబంధించిన యూట్యూబ్ ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేసిన తెలుగు హీరోల డ‌బ్బింగ్ వెర్ష‌న్ చిత్రాల‌కు భారీగా వ్యూస్ వ‌స్తున్నాయి. తాజాగా హీరో నితిన్ న‌టించిన ఆఅ, ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌, శ్రీ‌నివాస‌క‌ల్యాణం హిందీ వెర్ష‌న్‌కు ఓవ‌రాల్‌గా 400 మిలియ‌న్ వ్యూస్ రావ‌డం విశేషం.

`అఆ`కు 182 మిలియ‌న్ వ్యూస్ రాగా `అఆ 2` పేరుతో విడుద‌లైన ఛ‌ల్ మోహ‌న్‌రంగ చిత్రానికి 112 మిలియ‌న్‌ల వ్యూస్ వ‌చ్చాయి. శ్రీ‌నివాస క‌ల్యాణంకు 100 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. నితిన్ న‌టించిన  ఈ మూడు సినిమాలు వ్యూస్ విష‌యంలో హ్యాట్రిక్ సాధించ‌డం విశేషం. ఈ మూడు చిత్రాల‌కు సంబంధించిన హిందీ డ‌బ్బింగ్ హ‌క్కులు ఆదిత్యా మూవీస్ ద‌క్కించుకుంది. అలానే ఈ మూడు సినిమాలు నితిన్ కెరీర్‌లో వ‌రుస‌గా రిలీజ్ కావ‌డం విశేషం.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఉమేష్ గుప్త  మాట్లాడుతూ ` మా ఆదిత్య మూవీస్ ఛానెల్‌ని విశేషంగా ఆద‌రిస్తున్న వారంద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. త్రివిక్ర‌మ్‌గారి డైరెక్ష‌న్‌లో నితిన్ హీరోగా వ‌చ్చిన `అఆ` సినిమాను హిందీలోకి డ‌బ్బింగ్ చేయ‌డంతోనే  మా ఆదిత్య మూవీస్ మొద‌లైంది. సాధార‌ణంగా యాక్ష‌న్ మూవీస్ ఇష్ట‌ప‌డే నార్త్ ఆడియ‌న్స్ `అఆ` వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ఆద‌రించారు. ఈ సినిమా త‌రువాత కూడా నితిన్ న‌టించిన ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌, శ్రీ‌నివాస‌క‌ల్యాణం సినిమాల‌కి భారీ స్పంద‌న ల‌భించ‌డం విశేషం అని తెలిపారు. నితిన్‌గారు ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న న‌టించిన సినిమాల్లో దాదాపు 19 చిత్రాల ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారానే రిలీజ్ చేయ‌డం జ‌రిగింద‌ని, వాటిలో జ‌యం, దిల్‌, సై, ఇష్క్, అఆ, భీష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ వున్నాయి. ఇన్నేళ్లుగా మా సంస్థ‌పై న‌మ్మ‌కంతో వున్న నితిన్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు`అన్నారు.

డైరెక్ట‌ర్ ఆదిత్య గుప్త మాట్లాడుతూ `మ‌మ్మ‌ల్ని ఆద‌రిస్తున్న అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి మేము ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి వుంటాం. అలానే మమ్మ‌ల్ని న‌మ్మి మాకు అవ‌కాశం ఇచ్చిన  హీరో నితిన్‌గారికి, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా అభినంద‌న‌లు` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All