Homeటాప్ స్టోరీస్డీసెంట్ రేటింగ్స్ సాధించిన నితిన్ రంగ్ దే

డీసెంట్ రేటింగ్స్ సాధించిన నితిన్ రంగ్ దే

డీసెంట్ రేటింగ్స్ సాధించిన నితిన్ రంగ్ దే
డీసెంట్ రేటింగ్స్ సాధించిన నితిన్ రంగ్ దే

నితిన్ కు ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదు. 2021లో నితిన్ వి రెండు సినిమాలు విడుదలయ్యాయి. చెక్, రంగ్ దే చిత్రాలు నెల రోజుల వ్యవధిలో విడుదలవ్వగా ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి. అయితే రంగ్ దే చిత్రం టెలివిజన్ ప్రీమియర్ లో మాత్రం ఇంప్రెస్ చేసింది.

జూన్ 20న రంగ్ దే చిత్రం జీ ఛానల్ లో ప్రీమియర్ అయింది. మొదటి ప్రీమియర్ లో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 7.22 టిఆర్పి రేటింగ్ ను సాధించింది. నితిన్ చిత్రానికి ఈ రేటింగ్ అంటే డీసెంట్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన ఈ చిత్రం టివి టెలికాస్ట్ లో మాత్రం ఇంప్రెస్ చేయడం విశేషమే.

- Advertisement -

వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. నితిన్ నటించిన మరో సినిమా ఈ ఏడాది విడుదలవుతుంది. మేస్ట్రో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కాకపొతే మేస్ట్రో హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All