
యంగ్ హీరో నితిన్ తన పెండింగ్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసేసాడు. మేస్ట్రో చిత్ర షూటింగ్ ను గత వారమే పూర్తి చేసాడు. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలతో ఈ ఏడాది మూడు సినిమాలను విడుదల చేసిన తెలుగు హీరోగా నితిన్ నిలిచాడు.
అయితే నితిన్ తన ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చాడు. చెక్, రంగ్ దే అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఒక హిట్ తర్వాత 2, 3 ప్లాపులు వస్తుండడంతో నితిన్ గ్రాఫ్ ఒక స్థాయిని మించి వెళ్లట్లేదు.
అందుకే ఎంచుకోబోయే సినిమాల్లో కచ్చితమైన మార్పు ఉండాలని అనుకుంటున్నాడు. ఇందుకోసమే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట చిత్రాన్ని ఆపేసాడు. వక్కంతం వంశీ చిత్రాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరో సినిమాను కూడా ఓకే చేయనున్నాడు నితిన్.