
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ అంధాదున్`. హీరో ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ సురస్కారాన్ని అందించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ చిత్రాన్ని తెలుగులో `మాస్ట్రో` పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిఖితారెడ్డి, ఎన్. సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇస్మార్ట్ గాళ్ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో హిందీలో పోషించిన టాబు పాత్రని మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో వుంది. ఇటీవల నితిన్ పుట్టిన రోజున విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి శ్రీరామ నవమి సందర్భంగా కొత్త పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.
ఇందులో అంధుడిగా పియానిస్ట్‌గా నటిస్తున్న నితిన్ కొత్త పోస్టర్‌లో కొత్తగా కనిపిస్తున్నారు. గోవా వీధుల్లో నబా నటేష్ సెక్సీ థై షో చేస్తూ స్కూటీ నడుపుతుండగా వెనకాలబ్లాక్ గాగుల్స్, బ్లాక్ హెల్మెట్ పెట్టుకుని నితిన్ కనిపిస్తున్నాడు. వీరిమధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో కుదిరినట్టుగా కనిపిస్తోంది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం గోవాలో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేశారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Love is Blind and Love doesn’t Discriminate! #MAESTRO???? is on the way with his girl to wish you a Happy #SriRamaNavami ????????@actor_nithiin @NabhaNatesh @tamannaahspeaks @MerlapakaG @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella @mahathi_sagar @Jisshusengupta pic.twitter.com/RO3GdbcDuI
— BARaju (@baraju_SuperHit) April 21, 2021