Homeటాప్ స్టోరీస్కార్తికేయ 2 కోసం కష్టపడుతున్న దర్శకుడు

కార్తికేయ 2 కోసం కష్టపడుతున్న దర్శకుడు

Nikhil 's Karthikeya 2 on cardsకార్తికేయ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తొలి సినిమాతోనే దర్శకుడిగా సత్తా చాటాడు . అయితే ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య తో ప్రేమమ్ అనే మలయాళ రీమేక్ చిత్రం చేసి హిట్ కొట్టాడు . కట్ చేస్తే అక్కినేని నాగచైతన్య తోనే సవ్యసాచి అనే సినిమా చేసాడు గత ఏడాది . అయితే సవ్యసాచి డిజాస్టర్ అయ్యింది దాంతో కార్తికేయ కు ఛాన్స్ ఇచ్చే హీరోలు కరువయ్యారు .

 

- Advertisement -

శర్వానంద్ దగ్గరకు వెళ్తే డేట్స్ లేవని చెప్పడంతో మళ్ళీ నిఖిల్ దగ్గరకు వచ్చాడు . కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేయాలనీ కష్టపడుతున్నాడు . 2014 లో రిలీజ్ అయిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది , దాంతో కార్తికేయ 2 కి సన్నాహాలు చేస్తున్నారు . ఇక నిఖిల్ కూడా కార్తికేయ 2 కోసం ఆతృతగా ఉన్నాడు . అయితే తెలుగులో సీక్వెల్ లు హిట్ అయిన దాఖలాలు లేవు ఒక్క బాహుబలి మినహా . మరి ఈ కార్తికేయ 2 ఏమౌతుందో !

English Title : Nikhil ‘s Karthikeya 2 on cards

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All