అక్కినేని నాగచైతన్య సమంతకు అన్యాయం చేస్తున్నాడు . సమంత ని పక్కన పెట్టుకొని మరో భామకు లిప్ లాక్ ఇస్తూ తన ప్రేమని దోచి పెడుతున్నాడు చైతూ . ఏంటి ఇదంతా నిజమేనా ? అంటే సినిమా కోసం సుమా ! నాగచైతన్య మరో అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు కాకపోతే మజిలీ సినిమాలో . నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” మజిలీ ”.
ప్రేమికుల దినోత్సవం సందర్బంగా మజిలీ టీజర్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం . సమంత – నాగచైతన్య జంటగా నటించిన ఈ మజిలీ చిత్రాన్ని ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా వాలైంటెన్స్ డే ని పురస్కరించుకొని మజిలీ టీజర్ ని రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది . నాగచైతన్య ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు కాగా ఇపుడు సమంత తో కలిసి చేస్తున్న ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి .
English Title: Samantha and Nagachaitnaya’s Majili teaser talk
