
`అర్జున్ సురవరం` చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడుయంగ్ హీరో నిఖిల్. చాలా హార్డిల్స్‌ని అధిగమించిన ఈ మూవీ చివరికి థియేటర్లలో విడుదలైంది. అనూహ్యంగా సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుని వరుస ఫ్లాపుల్లో వున్న నిఖిల్‌కి మంచి విజయాన్ని అందించింది. ఈ మూవీ తరువాత నిఖిల్ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు.
ఆయన నటిస్తున్న తాజా చిత్రం `18 పేజెస్`. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్సణలో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
సుకుమార్ స్టోరీ, స్క్రీన్‌ప్లే తో పాటు నిర్మాణంలోనూ భాగస్వామి కావడంతో ఈ క్రేజీ కాంబినేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ క్రేజ్‌కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ మూవీ స్టోరీ వుంటుందని తెలుస్తోంది. ఇందులో తొలిసారిగా హీరో నిఖిల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, అందులో ఓ పాత్ర మెమొరీ లాస్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.