
`హ్యాపీడేస్`తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ బ్యాచ్‌లో మిగిలిన ఒకే ఒక్క హీరోగా. అందుకే సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేతని చాటుకుంటున్నారు. `అర్జున్ సురవరం` చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. సుకుమార్ సమర్పణలో రూపొందుతున్న `18 పేజెస్`తో పాటు ప్రిస్టేజియస్‌గా భావిస్తున్న `కార్తికేయ 2`లోనూ నటిస్తున్నారు.
ఇటీవలే వివాహం చేసుకున్న నిఖిల్ తాజాగా స్టార్ కమెడియన్ అలీ నిర్వహిస్తున్నషోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు. `హ్యాపీడేస్`లో అవకాశం ఎలా వచ్చిందో దాని వెనక జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీని ఈ సందర్భంగా బయటపెట్టారు. రాకేష్ పాత్రలో నిఖిల్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర ఆడిషన్స్ కోసం ఏకంగా లక్ష 20 వేల మంది పోటీ పడ్డారట. వారందరినీ వెనక్కి నెట్టి ఆ పాత్రని దక్కించుకోవడానికి నిఖిల్ పెద్ద ప్రయాసే పడాల్సి వచ్చిందంటున్నాడు.
ఈ పాత్రని తన కంటే ఎవరు బాగా చేసినా వారిని తీసుకుని తనని తొలగిస్తానని శేఖర్ కమ్ముల కండీషన్ పెట్టారట. ఆ సమయంలో సెట్‌లోకి ఎవరు వచ్చిన టెన్షన్ పడేవాడినని, ఆ సమయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో వున్న ఓ హీరో కూడా వచ్చాడని అదృష్టం కొద్ది ఆ పాత్ర తననే వరించిందని అలా తను `హ్యాపీడేస్`తో ఎంట్రీ ఇచ్చానని అసలు విషయం బయటపెట్టాడు నిఖిల్.