Homeటాప్ స్టోరీస్పెర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న ఇస్మార్ట్ భామ

పెర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న ఇస్మార్ట్ భామ

పెర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న ఇస్మార్ట్ భామ
పెర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న ఇస్మార్ట్ భామ

ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెల్సిందే. ఆ తర్వాత అఖిల్ తో mr మజ్ను చేసినా ఆ చిత్రం కూడా అదే ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ రెండు సినిమాలు ప్లాపైనా కూడా గతేడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ ఆమె ఫేట్ ను మార్చేసింది. ఈ సినిమా ద్వారా ఆమె మరోసారి తన గ్లామరస్ యాంగిల్ ను బయటపెట్టింది. ఈ సినిమా సాధించిన విజయంతో మరోసారి నిధి అగర్వాల్ కు అవకాశాల వెల్లువ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో వరస సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న సినిమాలో నిధి హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. అలాగే మాస్ మహారాజా రవితేజ సరసన రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నిధి ఎంపికైంది. ఈ చిత్రాలతో పాటు ఈ ఏడాది మలయాళ ఎంట్రీ కూడా ఇవ్వనుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిధి అగర్వాల్ తన అభిమానులకు ఎప్పటికప్పుడు హాట్ షో తో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇప్పుడు 5 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. రీసెంట్ గా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను పెట్టింది. దానికి అభిమానుల నుండి విశేష స్పందన రాగా ఆమె అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పడం విశేషం.

- Advertisement -

ఆమె రిలేషన్ స్టేటస్ పై వచ్చిన ప్రశ్నకు సమాధానమిస్తూ అందరూ అనుకుంటున్నట్లు తాను ఎవరితోనూ డేటింగ్ చేయలేదని, ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని పేర్కొంది. ఇంకా తన వాట్సాప్ డిపి, ఫోన్ లాక్ స్క్రీన్, ఆమె లాస్ట్ గా వాడిన యాప్ ఇలా అన్నిటికీ సమాధానాలు ఇచ్చింది. అలాగే తనకు ఇంటర్ లో 87 శాతం మార్కులు వచ్చినట్లుగా ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇలా నిధి అగర్వాల్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All