Homeటాప్ స్టోరీస్న్యూ ఇయర్ మూవీస్ అన్నీ షెడ్ కి వెళ్ళినట్లే

న్యూ ఇయర్ మూవీస్ అన్నీ షెడ్ కి వెళ్ళినట్లే

న్యూ ఇయర్ మూవీస్ అన్నీ షెడ్ కి వెళ్ళినట్లే
న్యూ ఇయర్ మూవీస్ అన్నీ షెడ్ కి వెళ్ళినట్లే

జనవరి 1న న్యూ ఇయర్ స్పెషల్ గా టాలీవుడ్ లో నాలుగైదు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ఏదీ కనీస స్థాయి ఓపెనింగ్స్ తెచ్చుకోలేక చతికిలపడ్డాయి. పేరున్న సినిమాలు రెండు కాగా మిగతావి వచ్చినట్లు వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలీదు. రామ్ గోపాల్ వర్మ చిత్రం బ్యూటిఫుల్, కన్నడ నుండి డబ్బింగ్ అయిన అతడే శ్రీమన్నారాయణ, ఉల్లాలా ఉల్లాలా, తూటా రాజా నరసింహ సినిమాలు జనవరి 1న విడుదలయ్యాయి.

వీటిలో బ్యూటిఫుల్ కు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశించారు. హీరోయిన్ నైనా గంగూలీ అందాలే ఆకర్షణగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చింది. సినిమాలో నైనా అందాలు తప్ప మరే సీన్ కూడా ఆకట్టుకోకపోవడంతో మొదటి ఆటతోనే సినిమా ఫేట్ డిసైడ్ అయిపోయింది. బ్యూటిఫుల్ కు కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ లేవు. అసలే అథమ స్థాయికి పడిపోయిన రామ్ గోపాల్ వర్మ బ్రాండ్ నేమ్ ఈ సినిమాతో మరింత కిందకి దిగజారింది.

- Advertisement -

కన్నడలో భారీ స్థాయిలో నిర్మించబడ్డ అతడే శ్రీమన్నారాయణ జనవరి 1న విడుదలైంది. ఈ సినిమా కన్నడలో మంచి విజయం సాధించడంతో తెలుగు వెర్షన్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అయితే సినిమాలో కన్నడ నేటివిటీ ఎక్కువవ్వడం, పబ్లిసిటీ అసలే లేకపోవడంతో అతడే శ్రీమన్నారాయణను పట్టించుకునే నాథుడే లేకపోయాడు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన తూటా ఎన్నో సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ జనవరి 1న ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమా ఎక్కువసార్లు వాయిదా పడడంతో జనాలకు ఆసక్తి పూర్తిగా సన్నగిల్లింది. పైగా కంటెంట్ కూడా వీక్ గా ఉండడంతో సినిమాకు ఓపెనింగ్స్ కూడా కరువయ్యాయి. ఇక మిగిలిన సినిమాల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరం.

జనవరి 1 సినిమాలు పూర్తిగా తేలిపోవడంతో అంతకు ముందు విడుదలైన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, మత్తు వదలరా సినిమాలకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ప్రతిరోజూ పండగే 30 కోట్ల క్లబ్ లోకి చేరింది. వెంకీ మామ లాభాల్లోకి వెళ్ళింది. సంక్రాంతి వరకూ ఈ మూడు సినిమాలే అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకోనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All