Homeటాప్ స్టోరీస్అతడే శ్రీమన్నారాయణ మూవీ రివ్యూ

అతడే శ్రీమన్నారాయణ మూవీ రివ్యూ

Athade Srimannarayana Movie Review Telugu
Athade Srimannarayana Movie Review Telugu

నటీనటులు: రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవాస్తవ
దర్శకత్వం: సచిన్ రవి
నిర్మాత‌లు: హెచ్ కె ప్రకాష్, పుష్కర మల్లికార్జునయ్య
సంగీతం: అజనీష్ లోకనాథ్, చరణ్ రాజ్
సినిమాటోగ్రఫర్: కర్న్ చావ్లా
ఎడిటర్: సచిన్ రవి
విడుదల తేదీ: జనవరి 1, 2019
రేటింగ్: 2.5/5

కన్నడ సినిమా నుండి మూడో ప్యాన్ ఇండియా చిత్రంగా అతడే శ్రీమన్నారాయణ ఈరోజు తెలుగులో విడుదలైంది. మిగతా ప్యాన్ ఇండియా సినిమాల్లా కాకుండా ఒక్కో భాషలో ఒక్కో రోజు విడుదలవుతోంది ఈ చిత్రం. గత వారం కన్నడలో విడుదలై సూపర్ డూపర్ హిట్ స్టేటస్ ను సంపాదించుకుంది. అక్కడి కలెక్షన్స్ కూడా బాగున్నాయి. మరి తెలుగు ఆడియన్స్ కు ఈ చిత్రం నచ్చుతుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూసి తెలుసుకుందాం.

- Advertisement -

కథ:
అధీరాలు ఒక తెగకు చెందిన వారు. వారు ఒక నిధి కోసం ఏళ్లకేళ్లుగా అన్వేషణ సాగిస్తుంటారు. ఎంత ప్రయత్నించినా దాని జాడ మాత్రం దొరకదు. 15 ఏళ్ల తర్వాత శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి) ఆ నిధి కనిపెట్టేందుకు సిద్ధపడతాడు. అసలు ఆ నిధి ఉందా? అది శ్రీమన్నారాయణకు దొరుకుతుందా? అసలు శ్రీమన్నారాయణ నేపధ్యం ఏంటి? ఎందుకు నిధి కోసం అన్వేషణ చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:
రక్షిత్ శెట్టి తనదైన శైలి బాడీ లాంగ్వేజ్ తో మెప్పిస్తాడు. తెలుగు వారికి కొత్తైనా ఈజీగా రక్షిత్ శెట్టి పెర్ఫార్మన్స్ తో కనెక్ట్ అవుతాం. తన మ్యానరిజమ్స్ భలేగా అనిపిస్తాయి. తన ఎనర్జీ కూడా బాగుంది. శాన్వి చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించింది. డీ గ్లామ్ రోల్ లో జర్నలిస్ట్ గా ఆమె పెరఫార్మన్స్ కు వంక పెట్టడానికేం లేదు. విలన్లుగా నటించిన బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి కూడా ఆకట్టుకుంటారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు:
ముందుగా సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు కచ్చితంగా నిర్మాణ విలువల ప్రస్తావన ముందు తెచ్చుకోవాలి. ఈ సినిమాను ఎంతో ప్యాషన్ తో నిర్మించినది అర్ధం అవుతుంది. ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని నమ్మినందుకు, అందులోనూ డిఫరెంట్ స్టైల్ నరేషన్ కూడా అయినా బెదరకుండా డబ్బులు పెట్టడానికి సిద్ధమైనందుకు అభినందనీయం. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి మూడేళ్లు పట్టింది. అయితే ఆ కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ నుండి మొదలుపెట్టి ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో కేర్ తీసుకున్నారు. అజినీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కాకపోతే నరేషన్ కొంత స్లో గా వెళ్లిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే మనం అలవాటు పడ్డవాటికి పూర్తి భిన్నంగా ఉంది. దర్శకుడు సచిన్ రవి ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు కానీ స్లో నరేషన్ కొంత ప్రేక్షకుడి ఫీల్ ను దెబ్బతీస్తుంది.

చివరిగా:
డిఫరెంట్ ట్రీట్మెంట్ తో తెరకెక్కిన అతడే శ్రీమన్నారాయణ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే స్లో నరేషన్ సినిమా ఫీల్ ను చెడగొడుతుంది. అసలు కథలోకి వెళ్ళడానికే చాలా టైమ్ పడుతుంది. సినిమా మొత్తం కన్నడ నేటివిటీ ఎక్కువగా ఉంటుంది. అది తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం ఎక్కుతుంది అన్నది అనుమానమే.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All