Homeటాప్ స్టోరీస్ప్రతి ఒక్కరూ అర్జున్ రెడ్డి తీయలేరుగా

ప్రతి ఒక్కరూ అర్జున్ రెడ్డి తీయలేరుగా

ప్రతి ఒక్కరూ అర్జున్ రెడ్డి తీయలేరుగా
ప్రతి ఒక్కరూ అర్జున్ రెడ్డి తీయలేరుగా

అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ కావడానికి కొంతమంది మితవాదులు ఇందులో డ్రగ్స్, బూతులు, హీరో ఆటిట్యూడ్ వంటి అంశాల వలన అని చెబుతుంటారు. కేవలం జనాల దృష్టిని ఆకర్షించడం కోసమే ఇవన్నీ పెట్టారు అని వాదిస్తుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అయితే అర్జున్ రెడ్డి లాంటి సినిమా సక్సెస్ కావడానికి కేవలం ఆ బూతులు, డ్రగ్స్, మందు వంటి సీన్లే కారణమా అంటే సందేహించాల్సిన పనిఉంది. ఎందుకంటే ఈ అంశాలతో తీసిన ప్రతి సినిమా హిట్టైపోయితుందా? ఈ పంథాలో తీసిన అన్ని సినిమాలు హిట్టైపోతే ఇక అర్జున్ రెడ్డి ప్రత్యేకత ఏముంటుంది? ప్రతి ఒక్కరూ అర్జున్ రెడ్డి లాంటి సినిమా అందించగలిగితే ఇక సందీప్ రెడ్డి వంగ స్పెషలిటీ ఏముంటుంది?

టాలీవుడ్ లో ఒక జబ్బు ఉంది. ఏదైనా ఒక సినిమా విడుదలై కల్ట్ హిట్ లేదా క్లాసిక్ అని పేరు పడితే ఇక వరసగా అలాంటి సినిమాలు, అటువంటి జోనర్ లో, అదే స్టైల్లో తెరకెక్కుతుంటాయి. గతంలోకి వెళితే పూరి జగన్నాథ్ తీసిన పోకిరి హిట్టయ్యిందని అదే స్టయిల్లో మెహెర్ రమేష్ కంత్రి తీస్తే అది ప్లాప్ అయింది. మగధీర సెన్సేషనల్ హిట్ అయిందని, అంతే బడ్జెట్ లో భారీ సినిమా చేస్తే అది శక్తి గా మారి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. టాలీవుడ్ లో అనుకరణ ద్వారా వచ్చిన సినిమాలు ఎప్పుడూ పల్టీ కొడుతూనే ఉన్నాయి. అయినా ఫిల్మ్ మేకర్స్ మాత్రం మారడం లేదు. వరసపెట్టి హిట్ అయిన జోనర్ లో సినిమాలే మళ్ళి మళ్ళీ తీయాలని ట్రై చేస్తున్నారు. బోల్తా కొడుతున్నారు. ఇందాక అర్జున్ రెడ్డి గురించి ప్రస్తావించుకున్నాం కదా. అర్జున్ రెడ్డి వంటి ఆటిట్యూడ్ ఉన్న హీరో క్యారెక్టరైజేషన్ తో డ్రగ్స్, మందు వంటి అంశాలను ప్రధాన కథా వస్తువుగా తెరకెక్కిన చిత్రం తిప్పరా మీసం.

- Advertisement -

హీరోకి ఎన్ని అవలక్షణాలు ఉంటే సినిమా అంత హిట్టు అన్న పంథాలో ఈ చిత్రం తెరకెక్కింది. తిప్పరా మీసం సినిమా చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమా గుర్తొస్తే అది పని తప్పు కాదు. అయితే అర్జున్ రెడ్డి చిత్రంలో హీరో బాధపడుతుంటే తనతో పాటు మనం కూడా బాధపడతాం. ఆఖర్లో హీరో, హీరోయిన్ కలిస్తే మనం కూడా సంతోషపడిపోతాం. అంతలా ఆ పాత్రలు మనకి కనెక్ట్ అవుతాయి. అర్జున్ రెడ్డి హిట్ అయింది, హీరో అవలక్షణాల వల్ల కాదు, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల. ఈ విషయం తెలుసుకోకుండా అర్జున్ రెడ్డిని అనుకరిస్తూ ఫిల్మ్ మేకర్స్ ఎన్ని కుప్పిగంతులు వేసినా సినిమా బొక్కబోర్లా పడటం ఖాయం.

నిజానికి తిప్పరా మీసం దర్శకుడు కృష్ణ విజయ్ టాలెంట్ ఉన్న దర్శకుడే. అతని మొదటి చిత్రం అసురతో అందరినీ మెప్పించాడు. ఇన్నేళ్ల తర్వాత గ్యాప్ తీసుకుని వస్తున్నాడు సినిమా అదిరిపోతుంది అనుకుంటే తిప్పరా మీసం ద్వారా నీరసం తెప్పించేసాడు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఫీలింగ్, ప్రతి సినిమా అర్జున్ రెడ్డి అయిపోదుగా అని. నిజమే మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All