Homeటాప్ స్టోరీస్తమిళ అర్జున్ రెడ్డి.. ఎట్టకేలకు విడుదల తేది ఫిక్స్

తమిళ అర్జున్ రెడ్డి.. ఎట్టకేలకు విడుదల తేది ఫిక్స్

arjun reddy remake aditya varma release date locked
arjun reddy remake aditya varma release date locked

తెలుగులో అర్జున్ రెడ్డి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. అందరూ విజయ్ దేవరకొండ నటనను తెగ పొగిడేశారు. విజయ్ కు స్టార్ స్టేటస్ ను తీసుకొచ్చిన సినిమాగా అర్జున్ రెడ్డిని చెప్పవచ్చు. ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డికి ఎంత పేరొచ్చిందో మనందరం చూసాం. అర్జున్ రెడ్డి విడుదలవ్వగానే పలు భాషల్లో ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనుక్కుని ఎగరేసుకుపోయారు.

తమిళంలో వర్మ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదట బాల దర్శకుడు. హిందీలో మాత్రం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డినే హిందీకి కూడా ఎంచుకున్నారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాలీవుడ్ లో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో మనందరం చూసాం. అక్కడ కూడా కల్ట్ క్లాసిక్ స్టేటస్ సంపాదించింది అర్జున్ రెడ్డి. అక్కడ కబీర్ సింగ్ పేరుతో విడుదలైన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ సాధించి షాహిద్ కు తొలి బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్ ను అందించింది.

- Advertisement -

అయితే సమస్య అంతా తమిళ వెర్షన్ తోనే వచ్చింది. ఇందాక చెప్పినట్లు వర్మ పేరుతో బాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ వెర్షన్ కు టీజర్, ట్రైలర్ కూడా విడుదల చేసారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. ఈ ట్రోల్స్ కారణమో మరొకటి తెలీదు కానీ చిత్ర నిర్మాణ సంస్థ సినిమాను చూసి సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. అందుకనే బాల తీసిన వెర్షన్ ను పూర్తిగా తీసి పక్కనపడేసి అర్జున్ రెడ్డికి అసిస్టెంట్ డైరెక్టర్ గా గిరీశాయను దర్శకుడిగా పెట్టి ఆదిత్య వర్మగా టైటిల్ పెట్టి, హీరోయిన్ ను కూడా మార్చేసి మరో వెర్షన్ ను రెడీ చేసారు. ఆదిత్య వర్మ ట్రైలర్ చూసిన జనాలు మొదటి వెర్షన్ మీద ఇది చాలా బెటర్ అంటూ కామెంట్స్ ఇచ్చారు. విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు రెడీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ నవంబర్ 8న విడుదల కానుంది.

ధృవ్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటిదాకా ఈ చిత్రాన్ని పూర్తిగా చూడలేదని చెప్పిన ధృవ్, తన తండ్రి విక్రమ్ మాత్రం దాదాపు వంద సార్లు ఈ సినిమా చూసి ఉంటాడని, తనకి ఈ చిత్రం బాగా నచ్చిందని ధృవ్ చెప్పుకొచ్చాడు. అన్నీ కుదిరితే త్వరలోనే తన తండ్రితో కలిసి నటిస్తానని చెప్పిన ధృవ్, ఎవరైనా దర్శకుడు తగిన మార్పులతో ముందుకు వస్తే విక్రమ్ సినిమా భీమ రీమేక్ లో నటించాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. ఇలా ఒకే సినిమాలో రెండు సార్లు ప్రతి సన్నివేశాన్ని నటించిన ధృవ్, తన తండ్రి సినిమా రీమేక్ లో నటించాలని కోరుకుంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All