Homeటాప్ స్టోరీస్తిప్పరా మీసం మూవీ రివ్యూ

తిప్పరా మీసం మూవీ రివ్యూ

తిప్పరా మీసం మూవీ రివ్యూ
తిప్పరా మీసం మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి తదితరులు
దర్శకత్వం: విజయ్ కృష్ణ
నిర్మాత‌లు: రిజ్వాన్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్: సిధ్
ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల

రీసెంట్ గా బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు ఈసారి పూర్తిగా బి,సి సెంటర్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రం తిప్పరా మీసం. ప్రోమోలు, ట్రైలర్ లతో అలరించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. టాలెంటెడ్ నటుడైన శ్రీవిష్ణు తొలిసారి పూర్తి మాస్ క్యారెక్టర్ చేయడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి తిప్పరా మీసం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ:
మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్నతనంలోనే దారితప్పుతాడు. ఆ వయసులోనే డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి ఈ క్రమంలో తన తల్లి (రోహిణి)పై ద్వేషం పెంచుకుని ఆమెకు దూరంగా ఉంటాడు. పెద్దయ్యాక పబ్ లో డీజేగా పనిచేస్తూ అక్కడ కూడా బెట్టింగ్స్ అవీ వేస్తూ ఆర్ధిక ఇబ్బందులు కొనితెచ్చుకుంటాడు. ఇవిలా ఉండగానే మౌనిక (నిక్కీ తంబోలి)ను ప్రేమిస్తాడు. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఇల్లీగల్ గేమ్స్ పై ఆసక్తి చూపిస్తాడు. కానీ వీటివల్ల తన జీవితమే తలక్రిందులవుతుంది. ఇల్లీగల్ గేమ్స్ వల్ల మణిశంకర్ ఎదుర్కునే ఇబ్బందులేవిటి? తన తల్లి ప్రేమను మణిశంకర్ అర్ధం చేసుకోగలిగాడా లేదా? తల్లిని అంతలా ద్వేషించడానికి కారణమేంటి? ఈ విషయాలను తెలుసుకోవడానికి తిప్పరా మీసం చూడాల్సిందే.

నటీనటులు:
శ్రీవిష్ణు ఎంత మంచి నటుడన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో తన నటనాపటిమను చూపించాడు. ఈ చిత్రంలో కూడా భిన్నమైన ఎమోషన్స్ ను పండించే అవకాశం దక్కింది. వాటిని చాలా చక్కగా తెరపై పండించగలిగాడు శ్రీవిష్ణు. సినిమా చివర్లో తన తల్లికి క్షమాపణ చెప్పుకునే సన్నివేశం చాలు శ్రీవిష్ణు రేంజ్ ను చెప్పడానికి. లవ్ సీన్స్ లో కూడా శ్రీవిష్ణు బాగా నటించాడు. నిక్కీ తంబోలి చూడటానికి బాగుంది. సినిమాలో ఆమె ఉన్నంతసేపూ ఆకట్టుకుంది. అయితే నటనాపరంగా పెద్దగా స్కోప్ ఏం దక్కలేదు. తల్లి పాత్రలో రోహిణికి చాలా మంచి పాత్ర పడింది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించేసిన రోహిణి ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాల్లో జీవించేసింది. ఎమోషనల్ ప్రేక్షకుడిని సినిమాతో కనెక్ట్ చేయడంలో ఆమె విజయవంతమైంది. బెనర్జీకి కూడా ఈ చిత్రంలో మంచి పాత్ర పడింది. మిగతా వారు ఈ సినిమాకు తమ వంతు పాత్ర పోషించారు.

సాంకేతిక విభాగం:
కథకుడిగా విజయ్ కృష్ణ విజయవంతమయ్యాడు. తిప్పరా మీసం కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే కథే ఇది. అయితే దర్శకుడిగా మాత్రం అతను విఫలమయ్యాడని చెప్పాలి. ఈ సినిమా కథకు తగ్గట్లుగా సన్నివేశాల్ని అల్లడంలో, ఆసక్తికరంగా సినిమాను చెప్పడంలో అతను తడబడ్డాడు. సినిమా పేస్ కూడా చాలా స్లో గా ఉంటూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ వర్క్ అదరగొట్టాడు. కానీ పాటల విషయంలో ఎక్కువ న్యాయం చేయలేదు. లవ్ సాంగ్ ఒకటే కొంచెం పర్వాలేదు. మిగతావి అంత గుర్తుండవు. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్ గా ఉంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే ఎఫెక్టివ్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా:
కథ బాగుంటే సరిపోదు, దాన్ని ఎఫెక్టివ్ గా ప్రేక్షకుడికి చెప్పగలగాలి. వినగానే బాగుందనిపించే తిప్పరా మీసం కథని ఆసక్తి లేని సన్నివేశాలతో ముందుకు నడిపించాలని చూసాడు దర్శకుడు. తెరపై శ్రీవిష్ణు, రోహిణి వంటి వారు ఎంత అద్భుతంగా నటించేసినా సన్నివేశాల్లో బలం లేకపోతే ప్రేక్షకుడికి అది పరీక్షే. మదర్ సెంటిమెంట్, అండర్ వాటర్ ఎపిసోడ్, ఫారెస్ట్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్స్ కాగా స్లో పేస్, ఆసక్తి లేని సన్నివేశాలు సినిమాకి మైనస్. ఇక ఈ సినిమాను చూడాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి.

రేటింగ్ : 2.5/5

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All