Homeగాసిప్స్షారుఖ్ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నయన్

షారుఖ్ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నయన్

షారుఖ్ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నయన్
షారుఖ్ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నయన్

సౌత్ ఇండియన్ టాప్ స్టార్ నయనతారకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చిత్రంలో నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అట్లీ తొలి తమిళ్ చిత్రం రాజా రాణి సినిమాలో కూడా నయన్ నటించిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటె ఆ మధ్య నయనతార ఈ చిత్రం నుండి తప్పుకుందని వార్తలు వచ్చాయి. నయన్ స్థానంలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారని అన్నారు.

ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యాక షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడంతో షారుఖ్ షూటింగ్ ను నిలిపివేశాడు. రీసెంట్ గా ఆర్యన్ కు బెయిల్ వచ్చింది. దీంతో మళ్ళీ షూటింగ్ ను మొదలుపెడుతున్నారు. సమంత కాకుండా నయనతార ఈ సినిమాలో నటిస్తోంది. ఆమె ఈ సినిమా నుండి తప్పుకోలేదు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాదర్ లో కూడా నయన్ నటిస్తుండగా డేట్స్ విషయంలో క్లాష్ వస్తుందని భావించింది కానీ ఇప్పుడు డేట్స్ కూడా సార్ట్ అవుట్ అయ్యాయి. షారుఖ్ – అట్లీ యాక్షన్ డ్రామాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించనుంది నయన్. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All