Homeటాప్ స్టోరీస్నయనతార సినిమా కోసం పాండిచ్చేరి చేరుకున్న సమంత

నయనతార సినిమా కోసం పాండిచ్చేరి చేరుకున్న సమంత

నయనతార సినిమా కోసం పాండిచ్చేరి చేరుకున్న సమంత
నయనతార సినిమా కోసం పాండిచ్చేరి చేరుకున్న సమంత

సమంత లీడ్ రోల్ లో చేస్తోన్న శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సాధారణంగా సినిమా సినిమాకూ ఎక్కువ సమయం తీసుకునే గుణశేఖర్ ఈ చిత్రాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేసాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శాకుంతలం నుండి ఫ్రీ అవ్వడంతో సమంత ఇప్పుడు తన తర్వాత చిత్రంపై ఫోకస్ పెట్టింది.

సమంత లీడ్ రోల్ లో నటిస్తోన్న తమిళ చిత్రం కాతు వాక్కుల రెండు కాదల్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. నయనతార ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. నయనతార, విగ్నేష్ శివన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన నానుమ్ రౌడీ థాన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

- Advertisement -

ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. 7 స్క్రీన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All