Homeటాప్ స్టోరీస్మరో ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

మరో ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

Nara rohith signed another project
Nara rohith signed another project

కెరీర్ స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సెట్ అవ్వని హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్ గా కోలుకోలేదని దెబ్బ కొడుతున్నాయి. అయితే కథలు ఎంపిక విషయంలో మాత్రం రోహిత్ ప్రతిసారి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా తనధైన శైలిలో ప్రయోగాలు చేస్తున్నాడు. చివరగా ఈ హీరో వీర బోగ వసంత రాయలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. ఇకపోతే తన ఫ్రెండ్ శ్రీ విష్ణు సినిమా ప్రమోషన్స్ లో ఇటీవల రోహిత్ సందడి చేశాడు. తిప్పరా మీసం ప్రమోషన్స్ లో భాగంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా దర్శకుడైన కృష్ణ విజయ్ తో ఒక డిఫరెంట్ సినిమా చేయనున్నట్లు చెప్పాడు.

- Advertisement -

గతంలో విజయ్ కృష్ణతో రోహిత్ అసుర అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మరో డిఫరెంట్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నారా రోహిత్ అనగనగ దక్షిణాదిలో అనే ఒక సినిమా చేస్తున్నాడు. బాణం దర్శకుడు చైతన్య దంతులూరి తెరకెక్కిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All