Homeటాప్ స్టోరీస్నారా రోహిత్ న్యూ మేకోవ‌ర్‌!

నారా రోహిత్ న్యూ మేకోవ‌ర్‌!

నారా రోహిత్ న్యూ మేకోవ‌ర్‌!
నారా రోహిత్ న్యూ మేకోవ‌ర్‌!

బాణం, సోలో వంటి భిన్న‌మైన చిత్రాల‌తో హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు నారా రోహిత్. ఆ త‌రువాత 17 చిత్రాల్లో న‌టించినా ఏదీ ప్ర‌క్ష‌కుల్ని ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. శ్రీ‌విష్ణుతో క‌లిసి న‌టించిన `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` మంచి పేరు తెచ్చిపెట్ట‌డ‌మే కాకుండా మంచి ప్ర‌య‌త్నం అంటూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని దక్కించుకుంది.

2018లో నారా రోహిత్ న‌టించిన చిత్రం `వీరభ‌క్ష‌గ‌వ‌సంత‌రాయ‌లు`. ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. ఈ సినిమా త‌రువాత నారా రోహిత్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. `అన‌గ‌న‌గ ద‌క్షిణాదిలో`, శబ్దం`, పండ‌గ‌ల‌వ‌చ్చాడు, మ‌ద్రాసి చిత్రాలు షూటింగ్ ద‌శలో వున్నాయా?  లేక ఆగిపోయాయా అనే  సమాచారం కూడా లేదు.

- Advertisement -

ఇదిలా వుంటే నారా రోహిత్ మునుప‌టి త‌ర‌హాలో మ‌ళ్లీ సిద్ధ‌మ్యాడు. బాణం, సోలో చిత్రాల స‌మ‌యంలో ఎలా మ్యాన్ల‌గా వున్నారో మ‌ళ్లీ అదే మేకోవ‌ర్‌లోకి మారిపోయారు. గ‌త కొంత కాలంగా బొద్దుగా మారుతూ వ‌చ్చిన నారా రోహిత్ తాజాగా స్లిమ్‌గా అండ్ ఫిట్‌గా త‌న మేకోవ‌ర్‌ని మార్చుకుని షాకిస్తున్నారు. తాజాగా ట్విట్ట‌ర్ బ్లాక్ క్యాప్ పెట్టుకుని క‌నిపిస్తున్న నారా రోహిత్ ఫొటో వైర‌ల్‌గా మారింది. ఇటీవ‌లే ట్విట్ట‌ర్‌లోకి ప్ర‌వేశించిన ఆయ‌న ఇక పై కాన్సెప్ ఓరియెంటెడ్ సినిమాల‌ని చేయాల‌నుకుంటున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All