
ఐకాన్ స్టార్ కు న్యాచురల్ స్టార్ పోటీ పడుతున్నాడు. ఇప్పటికే పుష్ప ది రైజ్ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప ది రైజ్ విడుదలవుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి పోటీగా న్యాచురల్ స్టార్ నాని వస్తున్నాడు.
నాని నుండి వస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్ర షూటింగ్ కొన్ని నెలల క్రితమే పూర్తయింది. నాని గత రెండు సినిమాలు ఓటిటిలోనే విడుదల కావడంతో శ్యామ్ సింగరాయ్ ను ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం శ్యామ్ సింగ రాయ్ ను డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 24న భారీ లెవెల్లో ఈ సినిమా విడుదలకానుంది.
గత కొంత కాలంగా తెలుగు హీరోలు అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా ప్యాన్ ఇండియా సినిమాలను సెట్ చేస్తున్నారు. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ తో నాని కూడా ప్యాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.