Homeటాప్ స్టోరీస్నాని చిత్రానికి ఆసక్తికర టైటిల్ ఫిక్స్

నాని చిత్రానికి ఆసక్తికర టైటిల్ ఫిక్స్

Nanis next is titled dasara
Nanis next is titled dasara

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా టక్ జగదీష్ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చినా కానీ ఓటిటిల్లో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డ్ సాధించింది. ఇప్పటికే నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు.

ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నాని తన తర్వాత చిత్రాన్ని ఈ దసరాకు అనౌన్స్ చేస్తానని చెప్పాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ అసోసియేట్ శ్రీకాంత్ డైరెక్ట్ చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు దసరా అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ సినిమా కోసం నాని కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడట. తెలంగాణ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. నాని లుక్ తో పాటు స్లాంగ్ అన్నీ సరికొత్తగా ఉంటాయని తెలుస్తోంది. ఆ దసరాకు చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All