Homeటాప్ స్టోరీస్ఓటిటిలో టక్ జగదీష్ రికార్డ్

ఓటిటిలో టక్ జగదీష్ రికార్డ్

tuck jagadish creates a record on amazon prime
tuck jagadish creates a record on amazon prime

న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయింది. వినాయక చవితి స్పెషల్ గా సెప్టెంబర్ 9 రాత్రి విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ నుండి, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. ఫ్యామిలీ డ్రామా ఓవర్ డోస్ మించిందని, స్టోరీ కూడా రొటీన్ గా ఉందని పేర్కొన్నారు.

అయితే టక్ జగదీష్ మాత్రం ఇప్పుడు ఒక రికార్డ్ సాధించింది. ఈ చిత్రం అత్యధికంగా చూసిన తెలుగు చిత్రంగా అమెజాన్ ప్రైమ్ లో రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. టక్ జగదీష్ మిక్స్డ్ రియాక్షన్ పొందినా కానీ వ్యూస్ పరంగా మాత్రం ఎక్కువ మందికి రీచ్ అయింది.

- Advertisement -

నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రను పోషించాడు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మించింది. ప్రస్తుతం నాని అంటే సుందరానికి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. శివ నిర్వాణ దీనికి దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All