Homeటాప్ స్టోరీస్దసరాకు భారీ ప్రకటన ఇవ్వనున్న నాని

దసరాకు భారీ ప్రకటన ఇవ్వనున్న నాని

దసరాకు భారీ ప్రకటన ఇవ్వనున్న నాని
దసరాకు భారీ ప్రకటన ఇవ్వనున్న నాని

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా టక్ జగదీష్ ఈరోజు రాత్రి విడుదలవుతోంది. ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. టక్ జగదీష్ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నాడు నాని. వి తర్వాత మరోసారి నాని చిత్రం థియేటర్లలో కాకుండా ఓటిటిలో విడుదలవుతోంది.

శివ నిర్వాణ టక్ జగదీష్ ను డైరెక్ట్ చేయగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా నాని తన సినిమాల విషయంలో కీలక ప్రకటన చేసాడు. ఈ దసరాకు తన నెక్స్ట్ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేస్తానని తెలిపాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్, అందులో తన లుక్ చూసి తన ఫ్యాన్స్ కచ్చితంగా స్టన్ అవుతారని ప్రకటించాడు. ఇప్పుడు ఆ ప్రకటన ఏమై ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

టక్ జగదీష్ తర్వాత శ్యామ్ సింగ రాయ్ సినిమాను పూర్తి చేసాడు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All