Homeన్యూస్క్రిస్మస్ బరిలో దూకుతోన్న రవితేజ, నాని

క్రిస్మస్ బరిలో దూకుతోన్న రవితేజ, నాని

క్రిస్మస్ బరిలో దూకుతోన్న రవితేజ, నాని
క్రిస్మస్ బరిలో దూకుతోన్న రవితేజ, నాని

ప్రస్తుతం టాలీవుడ్ లో చిత్రాల రిలీజ్ లకు సంబంధించిన అప్డేట్స్ విషయం ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి రేసులో భారీ చిత్రాలు నిలిచాయి. అలాగే ఫిబ్రవరిలో కూడా ఆచార్య, ఎఫ్3 వంటి పేరున్న సినిమాలు విడుదల కానున్నాయి. ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యామ్ సంక్రాంతికి అటూ ఇటూ విడుదలవుతోన్న విషయం తెల్సిందే. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు.

ఇక మీడియం బడ్జెట్ చిత్రాలకు డిసెంబర్ మంచి సీజన్ గా మారుతోంది. అయితే ఇక్కడ కూడా పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదలవుతోంది. మరోవైపు న్యాచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్ ను డిసెంబర్ 24న క్రిస్మస్ బరిలో దింపుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా షురూ చేసాడు. ఒక సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు క్రిస్మస్ రేసులో రవితేజ జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఖిలాడీ చిత్రాన్ని కూడా డిసెంబర్ 24కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకుడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All