Homeటాప్ స్టోరీస్రవితేజ 'రావణాసుర'..!

రవితేజ ‘రావణాసుర’..!

Raviteja Ravanasura movie title Raviteja70 Mass Raja
 

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. రవితేజ ఈసారి రావణాసుర టైటిల్ తో వస్తున్నట్టు టాక్. ఈ టైటిల్ నే త్వరలో చిత్రయూనిట్ ప్రకటించినున్నారట. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.

ప్రస్తుతం రవితేజ నటించిన ఖిలాడి రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత రామారావు ఆన్ డ్యూటీ కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే సుధీర్ వర్మ సినిమా మాత్రం రవితేజ మార్క్ తో ఉంటుందని అంటున్నారు.

- Advertisement -

రావణాసుర టైటిల్ తో మాస్ రాజా మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. మరి టైటిల్ తోనే ఓ వైబ్రేషన్స్ సృష్టిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All