Homeటాప్ స్టోరీస్రిపబ్లిక్ చిత్రానికి రివ్యూ ఇచ్చిన నాని

రిపబ్లిక్ చిత్రానికి రివ్యూ ఇచ్చిన నాని

రిపబ్లిక్ చిత్రానికి రివ్యూ ఇచ్చిన నాని
రిపబ్లిక్ చిత్రానికి రివ్యూ ఇచ్చిన నాని

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం తేజ్ ఇంకా హాస్పిటల్ లోనే ఉండడంతో  చిత్ర ప్రమోషన్స్ బాధ్యతను దర్శకుడు, హీరోయిన్ భుజానికెత్తుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ లాంచ్ చేయగా పవన్ కళ్యాణ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు విచ్చేశాడు.

సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవా కట్టా ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్ధమవుతోంది. ఈ చిత్రంలో తేజ్ ఐఏఎస్ అధికారి పంజా అభిరామ్ పాత్రలో కనిపిస్తాడు. ఇక రేపు విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఈరోజే నాని చూశాడట. చూసిన వెంటనే దాన్ని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.

- Advertisement -

“రిపబ్లిక్ చూసాను. సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్నవారి పట్ల చూపిన మంచి ఇప్పుడు రిపబ్లిక్ రూపంలో తిరిగి తనకు వస్తోంది. దేవా కట్టా ఐస్ బ్యాక్ అని చెప్పడానికి రిపబ్లిక్ సరైన ప్లాట్ ఫామ్. టీమ్ కు నా అభినందనలు” అని నాని ట్వీట్ చేసాడు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలో పోషించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All