Homeన్యూస్డైనమైట్ ను నేను డైరెక్ట్ చేయలేదు - దేవా కట్టా

డైనమైట్ ను నేను డైరెక్ట్ చేయలేదు – దేవా కట్టా

డైనమైట్ ను నేను డైరెక్ట్ చేయలేదు - దేవా కట్టా
డైనమైట్ ను నేను డైరెక్ట్ చేయలేదు – దేవా కట్టా

దర్శకుడిగా అరంగేట్రంలో సంచలనం సృష్టించాడు దేవా కట్టా. వెన్నెల వంటి మంచి చిత్రంతో డెబ్యూ చేసిన ఈ దర్శకుడు ఐదేళ్ల విరామం తర్వాత చేసిన ప్రస్థానం ఒక సంచలనం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా దర్శకుడిగా దేవా కట్టాకు చాలా మంచి పేరొచ్చింది. అయితే దేవా కట్టా తన తర్వాతి చిత్రాలతో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు.

ఆటోనగర్ సూర్యకు మంచి బజ్ వచ్చినా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గానే నిలిచింది. సినిమాలు ప్లాప్ అయినా ఈ దర్శకుడి పేరు మాత్రం ఎప్పుడూ పోగొట్టుకునేలా సినిమా చేయలేదు. అయితే అలాంటి దేవా కట్టా నుండి వచ్చింది డైనమైట్. తమిళ చిత్రానికి రీమేక్ గా మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ చిత్రం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ సినిమా తీసింది దేవా కట్టాఏనా అని అందరూ సందేహించేలా చేసింది. ఎందుకంటే సినిమాలో ఎక్కడా తన ముద్ర కనపడదు.

- Advertisement -

దేవా కట్టా కూడా ఆ సినిమా తాను చేయలేదని అంటున్నాడు. ఆటోనగర్ సూర్య ఫలితం తర్వాత యూఎస్ వెళ్ళిపోయి కొంత కాలానికి తిరిగి వచ్చాను. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను బలవంతంగా ఒప్పించి డైనమైట్ ప్రాజెక్ట్ ను నా చేతుల్లో పెట్టారు. నేను కేవలం 9 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నాను. వేరే ఎవరితోనూ సినిమాను తీసుకున్నారు. ఈ సినిమాను తీసింది నేను కాదు అని క్లారిటీ ఇచ్చాడు ఈ సెన్సిబుల్ దర్శకుడు.

రిపబ్లిక్ విషయంలో తాను ఫుల్ ఫ్రీడమ్ తో చిత్రాన్ని చేసానని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All