Homeటాప్ స్టోరీస్పోతురాజు ఫ్యాన్ ఆఫ్ పూరిజ‌గ‌న్నాథ్‌!

పోతురాజు ఫ్యాన్ ఆఫ్ పూరిజ‌గ‌న్నాథ్‌!

పోతురాజు ఫ్యాన్ ఆఫ్ పూరిజ‌గ‌న్నాథ్‌!
పోతురాజు ఫ్యాన్ ఆఫ్ పూరిజ‌గ‌న్నాథ్‌!

హిట్ కోసం గ‌జినీల దండ‌యాత్ర చేస్తున్నాడు యంగ్‌ హీరో నందు. హిట్ మూవీ `పెళ్లిచూపులు` చిత్రంలో న‌టించినా నందుకుకి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయింది. ఇటీవ‌ల `స‌వారి` అంటూ ఓ సినిమా చేసినా అది ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ని త‌న ఖాతాలో వేసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో నందు విజ‌య్‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం `బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌`. రాజ్ విఠ‌ల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

క్రేజీ యాంక‌ర్ ర‌ష్మీగౌత‌మ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజ‌యీభ‌వ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ ప‌గ‌డాల, బోస్ నిడిమోలు, ఆనంద్‌రెడ్డి మ‌డ్డి, మ‌నోహ‌ర్‌రెడ్డి ఈడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్ర టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం ఇటీవ‌ల విడుద‌ల చేసింది. తాజాగా మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ హీరో నందు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.

- Advertisement -

సినిమాలో హీరో నందు పాత్ర పేరు పోతురాజు. ఈ యువ‌కుడు క్రేజీ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌కు వీరాభిమాని. చేతిపై పూరి టాటూతో నందు పాత్ర చాలా కొత్త‌గా క‌నిపిస్తోంది. ర‌ష్మీగౌత‌మ్ క్యారెక్ట‌ర్ కూడా చాలా కొత్త‌గా వుంటుంద‌ని, ఈ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ని త్వ‌ర‌లో రిలీజ్ చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. స‌రికొత్త థీమ్‌తో తెర‌పైకి వ‌స్తున్న ఈ చిత్రం నందు కెరీర్‌ని మ‌లుపు తిప్ప‌డం ఖ‌యం అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All