Homeన్యూస్మెగా బ్యానర్ లో నందమూరి సినిమా?

మెగా బ్యానర్ లో నందమూరి సినిమా?

మెగా బ్యానర్ లో నందమూరి సినిమా?
మెగా బ్యానర్ లో నందమూరి సినిమా?

గీతా ఆర్ట్స్ అనగానే మెగా బ్యానర్ అనే మాట వస్తుంది. ఈ బ్యానర్ లో మెగా హీరోలు వరసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా చేస్తారు. అయితే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రస్తుతం తన బిజినెస్ మైండ్ ను ఉపయోగిస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక వర్గానికే పరిమితం కాకుండా అందరితో సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా అఖిల్ తో సినిమా చేసి హిట్ కొట్టాడు. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం గీతా ఆర్ట్స్ బ్యానర్ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అల్లు అరవింద్ ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో ను హోస్ట్ చేస్తున్నాడు బాలయ్య. అడిగిన వెంటనే కాదనకుండా ఈ షో చేయడానికి అంగీకరించాడు. ఈ షో కు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నప్పుడే అల్లు అరవింద్ తనతో సినిమా చేయాలనే ప్రపోజల్ ను బాలయ్య ముందు పెట్టగా వెంటనే మరో మాట లేకుండా ఎస్ చెప్పేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

బాలయ్యతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ షూట్ ను పూర్తి చేసాడు. గోపీచంద్ మలినేనితో సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిత్రం 2022 సెకండ్ హాఫ్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All