Homeటాప్ స్టోరీస్బాలయ్య సింహం సెంటిమెంట్ కొనసాగుతోంది

బాలయ్య సింహం సెంటిమెంట్ కొనసాగుతోంది

Nandamuri Balakrishna lion reference in Ruler
Nandamuri Balakrishna lion reference in Ruler

టాలీవుడ్ హీరోలలో ప్రతి ఒక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలాగే నందమూరి బాలకృష్ణకు సింహం సెంటిమెంటి ఒకటుంది. సినిమా టైటిళ్లలో, హీరోయిజం ఎలివేషన్స్ లో సింహం రెఫెరెన్స్ ను ఎక్కువగా వాడుతుంటారు. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మి నరసింహ, సింహ, జై సింహ, లయన్.. కొంచెం వెనక్కి వెళితే బొబ్బిలి సింహం… ఇలా సింహం రెఫెరెన్స్ బాలయ్య సినిమాల్లో కొనసాగుతూనే ఉంది. ఇక బాలకృష్ణ డైలాగుల్లో సింహం డైలాగ్ చాలా సార్లే వస్తుంది. అలాగే టైటిల్ డిజైన్ లో కూడా సింహం రెఫెరెన్స్ ను వాడుకుంటాడు బాలయ్య. లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా టైటిల్ లోగో చూసినా సింహం కనిపిస్తుంది. ఇక బాలయ్య ఎంట్రన్స్ అప్పుడూ, హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనుకున్నప్పుడు వెనకాల సింహం సౌండ్లు మనం వింటూనే ఉంటాం. నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారి ఎన్బీకే ఆర్ట్స్ ను స్థాపించిన విషయం తెల్సిందే. ఆ ప్రొడక్షన్ హౌజ్ లోగోలో కూడా బాలకృష్ణ సింహాన్ని, దాని గర్జన సౌండ్ ను ఉపయోగించుకున్నాడు.

ప్రతి సినిమాలో సింహం డైలాగ్ ను వాడుతూ వస్తోన్న బాలయ్య.. రూలర్ లో కూడా “పార్శిల్ చేయడానికి ఇది దెబ్బతిన్న సింహం రా.. అంత సులువుగా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది” అంటూ ఒక డైలాగ్ ను వాడారు. ట్రైలర్ లో ఈ డైలాగ్ ను పెట్టారు కూడా. థియేట్రికల్ ట్రైలర్ చూడటానికి కొంచెం రొటీన్ గానే ఉంది. మూస కమర్షియల్ సినిమాల్లో ఎక్కువగా ఉండే టెంప్లేట్ నే ఇందులో కూడా ఫాలో అయ్యారు. అయితే బాలకృష్ణ సినిమాలని ట్రైలర్ చూసి అంచనా వేయలేం. ట్రైలర్ రొటీన్ గా ఉన్న జై సింహ లాంటి సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రూలర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందోనని అందరూ ఆసక్తిగాఎదురుచూస్తున్నారు . ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ ఈ సినిమా హిట్ అవ్వడం అత్యవసరం. లాస్ట్ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలిన నేపథ్యంలో బాలకృష్ణ ఈ సినిమాతో హిట్ కొట్టి తానేంటో చూపించాలనుకుంటున్నాడు.

- Advertisement -

వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే భూమికకు చాలా ముఖ్యమైన పాత్రే ఇచ్చారనిపిస్తోంది. ఇక సోనాల్ చౌహాన్ అందాల విందుకే ఉంది. ఈ సినిమాలో మరోసారి బికినీ వేసి పిచ్చెక్కిస్తోంది. కెఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకుడు. చిరంతాన్ భట్ సంగీతం అందించాడు. బాలకృష్ణ పోలీస్ గా, కార్పొరేట్ గా భిన్న షేడ్స్ లో నటించాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All