Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ని అవమానించలేదట

విజయ్ దేవరకొండ ని అవమానించలేదట

nagashourya gives clarity on about his comments on vijay devarakodaనేను విజయ్ దేవరకొండనుద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడలేదని వివరణ ఇస్తున్నాడు హీరో నాగశౌర్య . స్టార్ డం అన్నది రాంచరణ్ తోనే ఆగిపోయిందని , స్టార్ అంటే ఎన్టీఆర్ , చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు మాత్రమే అని కామెంట్ చేసాడు నాగశౌర్య దాంతో విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి మాట్లాడాడని , విజయ్ ని నాగశౌర్య అవమానిస్తున్నాడని సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫాన్స్ నాగశౌర్య ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు దాంతో నాగశౌర్య వివరణ ఇస్తున్నాడు .

- Advertisement -

ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే సూపర్ స్టార్ కాదని , ప్లాప్ ఇచ్చినా కూడా అదే స్థాయి వసూళ్లు సాధించినప్పుడే స్టార్ అవుతారని అది పవన్ కళ్యాణ్ మాత్రమే సాధించాడని అంటున్నాడు నాగశౌర్య . ఈ హీరో చెప్పేది నిజమే అయినప్పటికీ వినేవాళ్ళు , అర్ధం చేసుకునే వాళ్ళు మాత్రం మరోలా భావిస్తున్నారు . అది కూడా ఇటీవలే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ కు మరీ ఆపాదిస్తున్నారు దాంతో ఈ గొడవ వచ్చిపడింది . మరి నాగశౌర్య మాటలు విజయ్ ఫ్యాన్స్ పట్టించుకుంటరా చూడాలి .

English Title: nagashourya gives clarity on about his comments on vijay devarakoda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts