Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కు మళ్ళీ కంటి ఆపరేషన్

పవన్ కళ్యాణ్ కు మళ్ళీ కంటి ఆపరేషన్

Once again Eye surgery for Pawan kalyan గతనెలలో పవన్ కళ్యాణ్ కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు అయితే విశ్రాంతి తీసుకోకుండా పర్యటనలు చేయడంతో ఇన్ ఫెక్షన్ సోకి ఇబ్బంది పెట్టడంతో నిన్న మళ్ళీ కంటికి ఆపరేషన్ చేసారు దాంతో జనసేన రాజకీయ పర్యటన వాయిదాపడింది . పవన్ కళ్యాణ్ కు కంటి ఆపరేషన్ మళ్ళీ చేసారు కాబట్టి మీడియాకి ఈ విషయం చెబితే మంచిదని ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు . కంటి ఆపరేషన్ జరగడంతో ఈసారి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు గట్టిగా చెప్పారట పవన్ కళ్యాణ్ కు .

అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు కావడంతో కుటుంబ సమేతంగా అన్నయ్య ఇంటికి వెళ్లిన పవన్ జన్మదిన శుభాకాంక్షలు అందజేసాడు . ఆ తర్వాత కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు . ఈ ఆపరేషన్ తో జనసేన కార్యక్రమాలు కొంతకాలం వాయిదాపడినట్లే ! వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ని ఓడించాలని కంకణం కట్టుకున్నాడు పవన్ , అందుకే జిల్లా పర్యటనలతో అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు . పవన్ సభలకు జనాలు అయితే బాగానే వస్తున్నారు కానీ ఓట్లుగా మారతాయా అన్నది చూడాలి .

- Advertisement -

English Title: once again eye surgery for pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All