Homeటాప్ స్టోరీస్సంక్రాంతికే రంగంలోకి దిగుతానంటోన్న నాగార్జున

సంక్రాంతికే రంగంలోకి దిగుతానంటోన్న నాగార్జున

సంక్రాంతికే రంగంలోకి దిగుతానంటోన్న నాగార్జున
సంక్రాంతికే రంగంలోకి దిగుతానంటోన్న నాగార్జున

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న బంగార్రాజు షూటింగ్ శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకు డైరెక్షన్ వహిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తోంది. రమ్యకృష్ణ మరోసారి నాగ్ సరసన నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో నాగ చైతన్య, కృతి శెట్టి కూడా నటిస్తున్నారు.

బంగార్రాజుకి సంక్రాంతి సీజన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే సోగ్గాడే చిన్ని నాయన కూడా సంక్రాంతి సీజన్ కే వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కాబట్టి మరోసారి నాగ్ సంక్రాంతి సీజన్ కే చిత్రాన్ని దింపాలనుకుంటున్నాడు. కానీ అదంతా ఈజీ కాదు. ఎందుకంటే 2022 సంక్రాంతి ఇప్పటికే ప్యాక్డ్ గా ఉంది.

- Advertisement -

జనవరి 7కి ఆర్ ఆర్ ఆర్ వస్తుండగా, 12,13,14 తారీఖుల్లో టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ చిత్రాలు కూడా సంక్రాంతి సీజన్ కే విడుదలవుతున్నాయి. మరి నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు వారం గ్యాప్ లో వస్తోన్న నేపథ్యంలో నాగార్జున తన చిత్రాన్ని కూడా పోటీలో ఉంచి రిస్క్ చేస్తాడా అన్నది చూడాలి. డిసెంబర్ కల్లా బంగార్రాజు షూటింగ్ పూర్తయ్యేలా చూస్తున్నాడు నాగార్జున.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All